bigboss: తమన్నాతో జర్నలిస్టులకు క్షమాపణ చెప్పించిన నాగార్జున

  • జర్నలిజం ఒక యాక్టింగ్ అన్న తమన్నా
  • తీవ్రంగా పరిగణించిన నాగార్జున 
  • చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నట్టు చెప్పిన తమన్నా

బిగ్‌బాస్ హౌస్‌లో జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోటీదారు తమన్నాపై హోస్ట్ నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమెతో జర్నలిస్టులు అందరికీ క్షమాపణలు చెప్పించాడు. జ్యోతితో తమన్నా గొడవ పడిన సందర్భంలో తమన్నా జర్నలిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జర్నలిస్టులు అందరూ యాక్టింగ్ చేస్తారని, శివజ్యోతి కూడా యాక్టింగ్ చేస్తోందని, జర్నలిజం ఒక యాక్టింగ్ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ యాక్ట్‌విస్టుగా జర్నలిస్టులు తనను సపోర్ట్ చేశారని చెప్పిన తమన్నా ఇప్పుడిలా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నాగార్జున తీవ్రంగా పరిగణించాడు.

ఇదే విషయాన్ని ప్రస్తావించి ఎందుకలా నోరు పారేసుకున్నావని ప్రశ్నించాడు. స్పందించిన తమన్నా తానలా అనలేదని అనడంతో నాగ్ మరింత సీరియస్ అయ్యాడు. హౌస్‌లో ఆమె మాట్లాడిన వీడియో క్లిప్‌ను చూపించడంతో తమన్నా సైలెంట్ అయిపోయింది. అది చూసి తలదించుకుని నవ్వుతున్న తమన్నాపై నాగార్జున మండిపడ్డాడు. అప్పుడేమో జర్నలిజం ఒక యాక్టింగ్ అని, ఇప్పుడు ముసుముసిగా నవ్వుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో స్పందించిన తమన్నా.. తాను నవ్వడం లేదని, చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నానని చెప్పుకొచ్చింది. దీంతో శివజ్యోతి సహా జర్నలిస్టులు అందరికీ తమన్నాతో నాగ్ క్షమాపణలు చెప్పించాడు.

bigboss
star maa tv
reality show
Tamannaah
Nagarjuna
  • Loading...

More Telugu News