Goshala: రాత్రికి రాత్రే 100 ఆవులు మరణించడం ప్రమాదవశాత్తు జరిగినట్టుగా అనిపించడంలేదు: చంద్రబాబు

  • కృష్ణా జిల్లా గోశాలలో ఒక్కసారే 100 ఆవులు మృత్యువాత
  • చావుబతుకుల్లో మరికొన్ని ఆవులు
  • దీనివెనుక కుట్ర ఉండొచ్చన్న చంద్రబాబు

కృష్ణా జిల్లా గోశాలలో ఒకేసారి 100 ఆవులు మృత్యువాత పడిన ఘటన సంచలనం సృష్టించింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. విజయవాడ శివారు ప్రాంతం గోశాలలో రాత్రికి రాత్రే 100 ఆవులు మరణించడం ప్రమాదవశాత్తు జరిగినట్టుగా అనిపించడంలేదని ట్వీట్ చేశారు. ఒక్కరాత్రిలోనే ఇంత పెద్ద సంఖ్యలో ఆవులు మరణించడం వెనుక ఏదో కుట్ర ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి నిందితులను పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూగప్రాణులను బలిదీసుకున్నవాళ్లను తప్పకుండా శిక్షించాలని చంద్రబాబు కోరారు. కాగా, ఈ ఘటనలో మరికొన్ని ఆవులు మృత్యువుతో పోరాడుతున్నట్టు తెలుస్తోంది.

Goshala
Vijayawada
Andhra Pradesh
Chandrababu
  • Loading...

More Telugu News