Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్డీయే తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి: కన్నా

  • అమరావతిలో మీడియాతో మాట్లాడిన కన్నా
  • ఆగస్టు 19 తర్వాత బీజేపీలోకి భారీ వలసలు ఉంటాయన్న ఏపీ బీజేపీ చీఫ్
  • జగన్ పాలనలో ఆత్రం తప్ప ప్రగతి లేదంటూ విమర్శలు

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇక తమతో జట్టు కట్టడం జరగని పని అని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఎన్డీయే తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయని అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం ముగిశాక ఆగస్టు 19 నుంచి బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కన్నా వెల్లడించారు.

కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో పాటు ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లు కూడా చరిత్రలో నిలిచిపోతుందని, ఈ విషయంలో తమకు విశేషమైన మద్దతు లభిస్తోందని అన్నారు. ఇక, ఏపీ సీఎం జగన్ పైనా కన్నా విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో హడావుడి తప్ప అభివృద్ధి జరిగిన దాఖలాలు శూన్యమని అభిప్రాయపడ్డారు.

Chandrababu
Kanna Lakshmi Narayana
BJP
Andhra Pradesh
Jagan
  • Loading...

More Telugu News