YSRCP: మొన్న ఆశా కార్యకర్తలు, నిన్న ‘గోపాల మిత్ర’లు, రేపు ‘మీ సేవ’ ఉద్యోగులన్నమాట!: జగన్ పై లోకేశ్ విమర్శలు
- అదృష్టం అందలం ఎక్కిస్తే, బుద్ధి బురదలోకి లాగుతుంది
- జగన్ ని చూస్తోంటే నిజమే అని తేలిపోయింది
- ఓటేసిన ఏ ఒక్కరినీ వదలడం లేదు!
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. లోకేశ్ తాజాగా వరుస ట్వీట్లు చేశారు. ‘‘మీ సేవ’ రద్దు యోచనలో ప్రభుత్వం’ ఉందంటూ ఓ పత్రికలో వెలువడిన కథనం ప్రతిని పోస్ట్ చేసిన లోకేశ్, అదృష్టం అందలం ఎక్కిస్తే, బుద్ధి బురదలోకి లాగుతుందన్నది జగన్ ని చూస్తుంటే నిజమే అని తేలిపోయిందని, అందరికీ సమన్యాయం చేస్తా అంటే ఏంటో అనుకున్నామని విమర్శించారు. మొన్న ఆశా కార్యకర్తలు, నిన్న గోపాల మిత్రలు, ఈరోజు జూడాలు, రేపు ‘మీ సేవ’ ఉద్యోగులు రోడ్ల పాలు కాబోతున్నారన్నమాట అని విమర్శించారు. ఓటేసిన ఏ ఒక్కరినీ వదలలేదని, జగన్ ఉద్దేశ్యంలో మాట తప్పం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.