Suresh Raina: క్రికెటర్ సురేశ్ రైనా మోకాలికి ఆపరేషన్

  • కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధ పడుతున్న రైనా
  • ఆమ్ స్టర్ డ్యామ్ లో ఆపరేషన్
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన బీసీసీఐ

టీమిండియా బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా మోకాలికి ఆపరేషన్ జరిగింది. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో రైనా బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో, ఆమ్ స్టర్ డ్యామ్ లో మోకాలికి ఆయన చికిత్స చేయించుకున్నాడు. ఆపరేషన్ విజయవంతమైనట్టు అక్కడి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. రైనా పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని తెలిపారు. రైనా ఆపరేషన్ పై బీసీసీఐ స్పందించింది. త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ట్వీట్ చేసింది. 

Suresh Raina
Surgery
BCCI
Team India
  • Loading...

More Telugu News