సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అలాంటి పాత్ర మళ్లీ చేస్తుందట!
- రానా సినిమా నుంచి తప్పుకున్న టబు
- రాజమండ్రికి 'భారతీయుడు2' యూనిట్
* ప్రముఖ నటి టబు ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. అలాగే, రానా నటించే 'విరాట పర్వం 1992' చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి కూడా ఒప్పుకుంది. అయితే, తాజాగా రానా చిత్రం నుంచి ఆమె తప్పుకున్నట్టు సమాచారం. ప్రాజక్టు ఆలస్యం కావడంతో డేట్స్ సమస్య వచ్చి చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది.
* కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందే 'భారతీయుడు 2' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ఈ నెల మూడో వారం నుంచి రాజమండ్రి పరిసరాల్లో జరుగుతుంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా కొంత షూటింగ్ చేస్తారట.