Tollywood: తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలి: సీఎం జగన్

  • జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన టాలీవుడ్ చిత్రాలు
  • మహానటి, రంగస్థలం, అ!, చి.ల.సౌ చిత్రాలకు జాతీయ పురస్కారాలు
  • చిత్ర బృందాలను అభినందించిన జగన్

జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ సినిమాలు గణనీయమైన స్థాయిలో సత్తా చాటడం పట్ల సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా ఇదే స్థాయిలో భవిష్యత్తులోనూ రాణించాలని ఆకాంక్షించారు. మున్ముందు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలషించారు. 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సత్తా చాటిన మహానటి, రంగస్థలం, అ!, చి.ల.సౌ చిత్ర బృందాలకు జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా చిత్రాల నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లను అభినందించారు. ఈమేరకు ఏపీ సీఎం కార్యాలయం ఓ ట్వీట్ చేసింది.

Tollywood
National Awards
Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News