Sensex: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 255 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 77 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • దాదాపు 8 శాతం పతనమైన యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లపై సర్ ఛార్జ్ ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. మరోవైపు, బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్సియల్ షేర్ల అండతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 255 పాయింట్లు పెరిగి 37,582కి చేరుకుంది. నిఫ్టీ 77 పాయింట్లు లాభపడి 11,110కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (3.36%), బజాజ్ ఫైనాన్స్ (2.46%), వేదాంత లిమిటెడ్ (2.17%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.07%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.03%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-7.91%), టెక్ మహీంద్రా (-2.50%), టాటా మోటార్స్ (-1.53%), టాటా స్టీల్ (-1.37%),  ఐటీసీ (-1.36%).

  • Loading...

More Telugu News