National Film Awards: జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్!

  • ‘మహానటి’ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేశ్
  •  ఆమె అద్భుత నటనకు గాను ఈ పురస్కారం
  • పలువురు సినీ ప్రముఖుల అభినందనలు

జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ ఎంపికైంది. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఈ రోజు ఢిల్లీలో ప్రకటించారు. టాలీవుడ్ మూవీ ‘మహానటి’ చిత్రంలో కీర్తి సురేశ్ అద్భుత నటనకు గాను ఆమెను ఈ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా నటి కీర్తి సురేశ్ ను అభినందిస్తూ పలువురు సినీ ప్రముఖులు సందేశాలు పంపారు. తెలుగు ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా ‘మహానటి’ ఎంపికైంది. ఇదే చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ పురస్కారం దక్కడం విశేషం.

National Film Awards
Mahanati
keerthi suresh
  • Loading...

More Telugu News