National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన.. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘మహానటి’
- 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు
- ఉత్తమ యాక్షన్ చిత్రంగా ‘కేజీఎఫ్’
ఢిల్లీలో 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. తెలుగు చిత్రాలు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకున్నాయి. జాతీయ ఉత్తమ ప్రాంతీయ (తెలుగు) చలనచిత్రంగా ‘మహానటి’ ఎంపికైంది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ పురస్కారం ‘మహానటి’, ఉత్తమ ఆడియోగ్రఫీ (రంగస్థలం- రాజాకృష్ణన్), ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రంగా చి.ల.సౌ, ఉత్తమ యాక్షన్ చిత్రంగా ‘కేజీఎఫ్’ ను ప్రకటించారు.
జాతీయ ఉత్తమ హిందీ చలన చిత్రంగా అంధాధున్, ఉర్దూ చిత్రంగా ‘హమీద్’ ఎంపికయ్యాయి. ఉత్తమ సంగీత దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలి (పద్మావత్), అదే చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారం లభించాయి. .
కాగా, అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా గత ఏడాది విడుదలైన చిత్రం ‘మహానటి’. నాగ్ దర్శకత్వంలో రూపొందింన ఈ చిత్రంలో నటి కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషించింది. భర్త పాత్రలో దుల్కర్ సల్మాన్, ఇతర పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ తదితరులు నటించారు.