Pakistan: పాకిస్థాన్ నటీనటులపై నిషేధం విధించాలంటూ మోదీకి లేఖ రాసిన ఆలిండియా సినీ వర్కర్లు
- ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం
- భారత సినిమాలపై నిషేధం విధించిన పాక్
- ఘాటుగా స్పందించిన ఆలిండియా సినీ వర్కర్ల సంఘం
బారత్ లో పాకిస్థాన్ నటీనటులు, కళాకారులపై తక్షణమే నిషేధం విధించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆలిండియా సినీ వర్కర్ల సంఘం (ఏఐసీడబ్ల్యూఏ) లేఖ రాసింది. భారత్ లో పనిచేస్తున్న పాకిస్థానీ ఫిలింమేకర్లు, ఆర్టిస్టులు, ట్రేడ్ భాగస్వాములపై పూర్తిస్థాయిలో నిషేధం విధించే వరకు యావత్ చిత్రపరిశ్రమ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఇష్టపడడంలేదని ఏఐసీడబ్ల్యూఏ తన లేఖలో పేర్కొంది. ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ లో భారత సినిమాలపై నిషేధం విధించారు. అందుకు ప్రతిగానే ఆలిండియా సినీ వర్కర్ల సంఘం దీటుగా బదులివ్వాలని నిర్ణయించుకుంది. నటీనటులపైనే కాకుండా దౌత్య అధికారులు, ఇతర ద్వైపాక్షిక సంబంధాల పైనా నిషేధం విధించాలని ప్రధాని మోదీని కోరింది.