Sukhoi 30: పంట పొలాల్లో కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. తప్పించుకున్న పైలట్లు

  • శిక్షణలో ఉండగా కూలిన విమానం
  • స్వల్ప గాయాలతో బయటపడిన పైలట్లు
  • దర్యాప్తునకు ఆదేశం

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం సుఖోయ్-30 గురువారం రాత్రి కుప్పకూలింది. అసోంలోని మిలాన్‌పూర్ ప్రాంతంలోని పంట పొలాల్లో కూలి కాలిబూడిదైంది. శిక్షణలో ఉన్న సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన అందులోని ఇద్దరు పైలట్లు పారాచూట్ల సాయంతో కిందికి దూకి తప్పించుకున్నారు.

పైలట్లు ఇద్దరూ స్వల్పంగా గాయపడినట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్  కల్నల్ హర్షవర్ధన్ పాండే తెలిపారు. వారిని తేజ్‌పూర్‌లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించినట్టు, ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఆయన తెలిపారు.

Sukhoi 30
Fighter Jet
Paddy Field
Assam
  • Loading...

More Telugu News