Andhra Pradesh: ఏపీలో అర్చకులకు కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలంటూ డిమాండ్
- మంత్రి వెల్లంపల్లిని సత్కరించిన సంఘం
- సుప్రీంకోర్టు సూచనలు అమలు చేయాలి
- దేవాదాయ శాఖ మంత్రికి అర్చకుల సంఘం విజ్ఞప్తి
అర్చకుల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను యథాతథంగా అమలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఆంధ్ర రాష్ట్ర ఆది శైవ అర్చక సంఘం సభ్యులు విన్నవించారు. విజయవాడలోని బ్రాహ్మణ వీధిలోని మంత్రి కార్యాలయంలో వెల్లంపల్లిని అర్చకుల సంఘం సభ్యులు ఈరోజు కలిశారు. ఈ మేరకు ఓ వినతిపత్రం సమర్పించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన అర్చకులకు ఇల్లు, అర్చకుల జీతం 25% పెంచడంపై అర్చకుల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ వెల్లంపల్లిని ఘనంగా సన్మానించారు.
కాగా, అర్చక సంక్షేమ నిధికి రూ.500 కోట్ల డిపాజిట్లు చేర్చాలని, అర్చకులు అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, అర్చకులకు కనీస వేతనం రూ.25,000గా నిర్ణయించాలంటూ తమ డిమాండ్లను అర్చక సంఘం సభ్యులు తమ వినతిపత్రంలో కోరారు.