Telugudesam: పవిత్రమైన ఆవుతో పోల్చుకునే అర్హత చంద్రబాబుకు లేదు: మంత్రి నారాయణస్వామి

  • చంద్రబాబు హయాంలో సుపరిపాలన లేదు
  • మంచిపాలన అందిస్తే టీడీపీ ఎందుకు ఓడిపోతుంది?
  • నాలుగేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం

‘పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే దున్నపోతును’ తెచ్చుకున్నారన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవిత్రమైన ఆవుతో పోల్చుకునే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. చంద్రబాబు తన హయాంలో సుపరిపాలన అందించి ఉంటే టీడీపీ ఎందుకు ఓడిపోతుందని ప్రశ్నించారు. ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. నాలుగేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయమని ప్రజలను అడగమని అన్నారు.

Telugudesam
Chandrababu
minister
Narayana swamy
  • Loading...

More Telugu News