Vijayasanthi: కేసీఆర్ ఆర్టికల్ 370 రద్దుపై ఎంఐఎంను ఒప్పిస్తే బాగుండేది: విజయశాంతి

  • ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఒవైసీ
  • కేంద్రానికి మద్దతు పలికిన టీఆర్ఎస్
  • ఒవైసీతో కేసీఆర్ చర్చలు జరిపి ఉండాల్సిందన్న విజయశాంతి

కేంద్రం సంచలనాత్మక రీతిలో ఆర్టికల్ 370ని రద్దు చేయడం తెలిసిందే. రాజకీయ పక్షాల్లో చాలావరకు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాయి. టీఆర్ఎస్ కూడా కేంద్రం నిర్ణయానికి మద్దతు పలికింది. అయితే, ఎంఐఎంతో దోస్తీ కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ఆర్టికల్ 370 రద్దు విషయంలో మాత్రం తన సొంత నిర్ణయానికే కట్టుబడింది. దీనిపై కాంగ్రెస్ నేత విజయశాంతి హర్షం వ్యక్తం చేశారు. బీజేపీని వైరిపక్షంగా భావించే టీఆర్ఎస్ దేశప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం సమంజసంగా ఉందని పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకున్న కేసీఆర్ అదే సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కూడా నచ్చజెప్పి ఉంటే మరింత బాగుండేదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. కశ్మీర్ విభజనపై పార్లమెంటులో సరైన రీతిలో చర్చ జరగలేదన్నది మాత్రమే ఒవైసీ అభ్యంతరంగా కనిపిస్తోందని, ఈ నేపథ్యంలో, ఆయనతో చర్చలు జరిపి ఎంఐఎం మద్దతు కూడా సంపాదించి ఉంటే తెలంగాణ ప్రజలు సంతోషించే వారని అన్నారు.

  • Loading...

More Telugu News