KTR: కామోన్మాది ప్రవీణ్ కు త్వరగా శిక్ష పడేలా చేశారంటూ పోలీసులు, న్యాయవాదులకు కేటీఆర్ అభినందనలు

  • వరంగల్ లో పసికందుపై ప్రవీణ్ ఘాతుకం
  • మరణశిక్ష విధించిన న్యాయస్థానం
  • ప్రవీణ్ ను మానవమృగం అని పేర్కొన్న కేటీఆర్

సభ్యసమాజం దిగ్భ్రాంతి చెందేలా పసికందుపై అత్యాచారం చేసి చంపేసిన కామోన్మాది ప్రవీణ్ కు త్వరగా శిక్ష పడేలా చేశారంటూ పోలీసులు, న్యాయవాదులకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. ప్రవీణ్ మనిషి కాదని, అతడో మానవమృగం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి పైశాచిక మనస్తత్వం కలిగిన నేరస్తులను సభ్యసమాజం నుంచి తరిమికొట్టాలంటే కఠినమైన చట్టాలకు తోడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరమని అన్నారు. ప్రవీణ్ కుమార్ కు వరంగల్ జిల్లా న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ ఘాతుకానికి న్యాయవాదులు ఎవరూ అతడికి సహకరించకూడదని నిర్ణయించుకోగా, ప్రభుత్వమే ఓ న్యాయవాదిని సమకూర్చింది.

KTR
Warangal Urban District
  • Loading...

More Telugu News