Jammu And Kashmir: శ్రీనగర్ జైల్లో వున్న 70 మంది ఉగ్రవాదులను ఆగ్రాకు తరలించిన ఆర్మీ?

  • ఉగ్రవాదులతో పాటు వేర్పాటువాదులను కూడా
  • ఐఏఎఫ్ విమానంలో తరలించినట్టు సమాచారం
  • ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారం 

కశ్మీర్ నుంచి 70 మంది ఉగ్రవాదులు, వేర్పాటువాదులను ఇండియన్ ఆర్మీ అధికారులు తరలించారు. ఉగ్రవాదులను శ్రీనగర్ నుంచి ఆగ్రాకు ఐఏఎఫ్ విమానంలో తరలించినట్టు సమాచారం. జమ్ముకశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దుతో పొరుగుదేశం పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పై పాక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలకు సమాచారం ఉంది. శ్రీనగర్ జైల్లో బందీలుగా ఉన్న తమ వారిని విడిపించుకునేందుకు ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందన్న సమాచారం నేపథ్యంలో వారిని ఆగ్రాకు తరలించినట్టు తెలుస్తోంది.

Jammu And Kashmir
Terrorists
Srinagar
Aagra
  • Loading...

More Telugu News