Biswabhusan Harichandan: ఏపీ గవర్నర్ హోదాలో రాష్ట్రపతిని కలిసిన బిశ్వభూషణ్ హరిచందన్

  • ఏపీ పరిస్థితులను రాష్ట్రపతికి వివరించిన గవర్నర్
  • ఢిల్లీలో మూడు రోజుల పాటు ఏపీ గవర్నర్ పర్యటన
  • రేపు ఉపరాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రితో భేటీ

ఏపీ గవర్నర్ గా ఇటీవలే నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ అధికారిక హోదాలో తొలిసారి రాష్ట్రపతిభవన్ కు వెళ్లారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో హరిచందన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితులను, తాజా పరిణామాలను ఆయన రాష్ట్రపతికి వివరించారు. గవర్నర్ వెంట అయన కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, ఏడీసీ మాధవరెడ్డి కూడా ఉన్నారు. తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ గవర్నర్ రేపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలవనున్నారు.

Biswabhusan Harichandan
Governor
Andhra Pradesh
Ram Nath Kovind
President Of India
New Delhi
  • Loading...

More Telugu News