Bandaru Dattatreya: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కాదు... ఎత్తిదింపుడు పథకం: దత్తాత్రేయ

  • కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజక్టు అంటూ మండిపాటు
  • వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్
  • కేంద్ర ప్రభుత్వాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదంటూ ఆరోపణ

బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కాళేశ్వరం ప్రాజక్టు విషయంలో తెలంగాణ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజక్టు నిర్మించారంటూ మండిపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కాదని, ఎత్తిదింపుడు పథకం అని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడంలేదని దత్తన్న ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ గెలుపుతోనైనా కేసీఆర్ కు కనువిప్పు కలగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

Bandaru Dattatreya
BJP
Telangana
KCR
TRS
Kaleswaram
  • Loading...

More Telugu News