Jagan: వరద ప్రాంతాలలో ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు అదనపు సాయం ప్రకటించిన సీఎం జగన్
- వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం ఏరియల్ సర్వే
- ఢిల్లీ నుంచి నేరుగా వచ్చి ఏరియల్ సర్వేలో పాల్గొన్న జగన్
- సహాయచర్యలు కొనసాగించాలంటూ అధికారులకు వెల్లడి
ఏపీ సీఎం జగన్ ఉత్తరాంధ్ర వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జగన్ రాజమండ్రిలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.5000 అదనపు సాయం అందించాలంటూ అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా, అన్ని విధాలా సహాయచర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు. సమీక్ష ముగిసిన అనంతరం జగన్ విజయవాడ బయల్దేరారు. అక్కడ్నించి తాడేపల్లిలోని తన నివాసానికి వెళతారు. జగన్ ఈ ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఏపీ చేరుకుని ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు.