Varla Ramaiah: అయ్యా సీఎం గారూ, పాడె మోసే మహిళలు హెల్త్ వర్కర్లలా ఉన్నారు: జగన్ పై మరో సెటైర్ వేసిన వర్ల రామయ్య

  • రాష్ట్రంలో ఆరోగ్య కార్యకర్తల ధర్నాలు
  • ట్విట్టర్ లో ఫొటో పెట్టిన వర్ల
  • ఏమిటి వాళ్లకీ ఖర్మ? అంటూ ఆవేదన

ఇటీవల ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన టీడీపీ, సోషల్ మీడియా ద్వారా ప్రస్తుత ప్రభుత్వాన్ని అనేక సమస్యలపై నిలదీస్తూ క్రియాశీల విపక్షంగా కొనసాగుతోంది. తాజాగా, టీడీపీ నేత వర్ల రామయ్య హెల్త్ వర్కర్ల సమస్యలపై స్పందించారు. రాష్ట్రంలో పలుచోట్ల ఆరోగ్య కార్యకర్తలు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపడుతుండడాన్ని విమర్శనాంశంగా తీసుకున్న ఆయన ఓ ఫొటో ద్వారా సీఎం జగన్ పై వ్యంగ్యం ప్రదర్శించారు.

ఆ ఫొటోలో కొందరు హెల్త్ వర్కర్లు ప్రభుత్వం దిష్టిబొమ్మను పాడెపై పడుకోబెట్టి మోసుకుంటూ వెళుతున్నారు. దీనిపై ట్వీట్ చేసిన వర్ల రామయ్య, "అయ్యా సీఎం గారూ, ఆ పాడె మోసే మహిళలు హెల్త్ వర్కర్లలా ఉన్నారు, వాళ్లకు ఈ ఖర్మ ఏమిటి చెప్పండి? మీరు మళ్లీ ఏదో మాట తప్పినట్టున్నారు, అందుకే మీ సర్కారుకు పాడె కట్టేశారు. మాట తప్పని, మడమ తిప్పని మీరు ఇలాంటి చిన్న ఉద్యోగుల కడుపు కొట్టొద్దు. వాళ్లకు న్యాయం చేయండి" అంటూ తనదైన శైలిలో హితవు పలికారు.

Varla Ramaiah
Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News