Sushma Swaraj: సుష్మాతో పరిచయం ఉండడాన్ని గౌరవంగా భావిస్తున్నాను: ట్రంప్ కుమార్తె

  • గుండెపోటుతో సుష్మ స్వరాజ్ హఠాన్మరణం
  • ట్విట్టర్ లో స్పందించిన ఇవాంకా ట్రంప్
  • సుష్మను విజేతగా అభివర్ణించిన ఇవాంకా

తన సమర్థతతో భారత విదేశాంగ శాఖకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టిన కేంద్ర మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సుష్మ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ స్పందించారు. సుష్మ మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. సుష్మ స్వరాజ్ ను విజేతగా అభివర్ణించిన ఇవాంకా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆమె ఓ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. అలాంటి వ్యక్తితో పరిచయం ఉండడాన్ని తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. వృత్తి పట్ల ఎంతో అంకితభావం ఉన్న నేతను భారత్ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Sushma Swaraj
Ivanka Trump
Donald Trump
USA
  • Loading...

More Telugu News