Pakistan: పాకిస్థాన్ లాంటి పొరుగు దేశం ఎవరికీ ఉండరాదు: రాజ్ నాథ్ సింగ్

  • నీ స్నేహితుడిని నీవు మార్చగలవు
  • కానీ, పొరుగువారిని మార్చలేవు
  • మన ఇబ్బందంతా పొరుగు దేశంతోనే

భారత్ తో దౌత్య, వాణిజ్య సంబంధాలను కనిష్ట స్థాయికి తగ్గిస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. పాకిస్థాన్ లాంటి పొరుగు దేశం ఎవరికీ ఉండరాదని అన్నారు. మన ఇబ్బందంతా పొరుగు దేశంతోనే అని చెప్పారు.

 'నీ స్నేహితుడుని నీవు మార్చగలవు. కానీ, పొరుగువారిని మార్చే శక్తి నీ చేతిలో ఉండదు. ఇదే అసలు సమస్య. ఇలాంటి పొరుగు దేశం ఏ దేశానికీ ఉండకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నా' అని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత భారత్ పై పాకిస్థాన్ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ చట్ట వ్యతిరేక చర్యలను అంతర్జాతీయ వేదికలపై ఎండగడతామని కూడా హెచ్చరించింది. అయితే, పాక్ హెచ్చరికలను భారత్ ఖాతరు చేయడం లేదు. 

Pakistan
India
Rajnath Singh
BJP
  • Loading...

More Telugu News