Andhra Pradesh: ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ.. ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం!

  • పదవి నుంచి తప్పుకున్న నన్నపనేని
  • వెంటనే ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం
  • 2011 నుంచి జగన్ వెంట నడుస్తున్న పద్మ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. టీడీపీ నేత నన్నపునేని రాజకుమారి ఈ పదవి నుంచి తప్పుకున్న వెంటనే వాసిరెడ్డి పద్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

కృష్ణా జిల్లాకు చెందిన వాసిరెడ్డి పద్మ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. 2011లో ఆమె తన భర్త కనికళ్ల వెస్లీతో కలిసి వైసీపీలో చేరారు. వైసీపీలో చురుగ్గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ, ఇతర రాజకీయ పార్టీల విమర్శలను తిప్పికొట్టారు. వైసీపీ తరఫున పలు టీవీ, చర్చా కార్యక్రమాల్లో పాల్గొని తమ పార్టీ సిద్ధాంతాలు, విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. చంద్రబాబు హయాంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో పద్మ కృషిని గుర్తించిన సీఎం జగన్ ఆమెను ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు.

  • Loading...

More Telugu News