Sampoo: 'కొబ్బరి మట్ట'లో కత్తి మహేశ్ పై డైలాగ్ కి భలే రెస్పాన్స్

  • సంపూ హీరోగా 'కొబ్బరిమట్ట'
  • తల్లిపాత్రలో నటించిన షకీలా 
  • ఈ నెల 10వ తేదీన విడుదల

సంపూర్ణేశ్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'కొబ్బరిమట్ట' చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సంపూ తండ్రిగా .. షకీలా భర్తగా కత్తి మహేశ్ కనిపిస్తాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. ట్రైలర్ లో కత్తి మహేశ్ ను ఉద్దేశించి చెప్పిన డైలాగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.

ఫన్నీ లుక్ తో వున్న కత్తి మహేశ్ ఫొటో పట్టుకుని షకీలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన లాయర్ 'చనిపోయారా' అని అడుగుతాడు. అందుకు షకీలా "అయ్యో లేదండి .. ఎక్కడ పడితే అక్కడ .. ఏది పడితే అది వాగుతున్నాడనీ పోలీసులు నగర బహిష్కరణ చేశారు" అని ఏడుస్తూ బదులిస్తుంది. కత్తి మహేశ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనని అన్వయిస్తూ చెప్పిన ఈ డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది .. సోషల్ మీడియా జనాలను మరింతగా ఆకట్టుకుంటోంది.

Sampoo
Shakeela
  • Error fetching data: Network response was not ok

More Telugu News