Karnataka: వరద నీటిలో డీజే సంబరాలు.. కర్ణాటకలో ఎంజాయ్ చేస్తున్న ఊరి ప్రజలు!

  • బెళగావి సమీపంలోని యమగర్ణిలో ఘటన
  • రోడ్డుపై భారీగా నిలిచిపోయిన వరద నీరు
  • డీజే సిస్టమ్ పెట్టి మరీ ఎంజాయ్ చేసిన గ్రామస్తులు

సాధారణంగా భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు, రోడ్లు ఏకమైపోతే మనం ఏం చేస్తాం? ఎలాంటి అంటువ్యాధులు రాకుండా నీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. కానీ కర్ణాటకలోని బెళగావి ప్రాంత వాసులు మాత్రం వరదలను పండుగలా జరుపుకుంటున్నారు.

ఇక్కడి యమగర్ణి గ్రామంలో భారీగా వరద నీరు నిలిచింది. దీంతో ఆ గ్రామ ప్రజలు నిప్పని-కొల్హాపూర్ జాతీయ రహదారి దగ్గరకు డీజే సిస్టమ్ ను తీసుకొచ్చారు. అనంతరం పాటలు పెట్టి నీటిలో స్టెప్పులేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News