Jagan: ఢిల్లీలో తాను కలిసిన వారి కోసం కానుకలు తీసుకెళ్లిన వైఎస్ జగన్!

  • ముగిసిన జగన్ రెండు రోజుల పర్యటన
  • పలువురు నేతలను కలుసుకున్న ఏపీ సీఎం
  • విభజన సమస్యల పరిష్కారంపై చర్చ

ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల న్యూఢిల్లీ పర్యటనను ముగించుకుని మరికాసేపట్లో అమరావతి చేరుకోనున్నారు. ఈ రెండు రోజుల్లో జగన్ పలువురు కేంద్ర పెద్దలను కలుసుకుని, ఏపీ విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ఢిల్లీకి బయలుదేరిన జగన్, తాను కలిసే ప్రతి ఒక్కరికీ లడ్డూ ప్రసాదంతో కూడిన కానుకలు తీసుకెళ్లారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని జ్ఞాపికలు, శాలువాలు, లడ్డూ ప్రసాదాలను ఆయన తీసుకెళ్లి కేంద్ర మంత్రులకు అందించారు. కాగా, జగన్ తన రెండు రోజుల పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ తదితరులను కలుసుకున్నారు. ప్రతి ఒక్కరికీ ఆయన రాష్ట్రం తరఫున కానుకలను తీసుకెళ్లారు.

Jagan
New Delhi
BJP
Ram Nath Kovind
Narendra Modi
Venkaiah Naidu
Nitin Gadkari
Nirmala Seetaraman
  • Loading...

More Telugu News