Andhra Pradesh: కియా ‘మేడిన్ ఆంధ్రా’ కారు ఈరోజు విడుదల అవుతోంది!: నారా లోకేశ్

  • ఇందుకోసం చంద్రబాబు చాలా కృషి చేశారు
  • ఇది ఓ దార్శనికుడి స్వప్నానికి ఫలితం
  • కంపెనీ యాజమాన్యం, సిబ్బందికి శుభాకాంక్షలు

అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ఫ్యాక్టరీ నుంచి నేడు మొట్టమొదటి ‘మేడిన్ ఆంధ్రా కారు’ విడుదల అవుతోందని టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. కియా మోటార్స్ ను ఏపీకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిదని వ్యాఖ్యానించారు.

ఇది ఓ దార్శనికుడి స్వప్నానికి ఫలితమని చెప్పారు. ఈరోజు కియా మోటార్స్ తొలికారు విడుదల అవుతున్న సందర్భంగా కియా కంపెనీ యాజమాన్యానికి, సిబ్బందికి నారా లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Anantapur District
kia cars
First made in andhra cars
Nara Lokesh
Twitter
Chandrababu
Telugudesam
  • Error fetching data: Network response was not ok

More Telugu News