Andhra Pradesh: ఏపీ మంత్రి బాలినేని పీఏ లీలల గురించి లోకం కోడై కూస్తోంది!: వర్ల రామయ్య

  • పీఏ భీమేశ్ చాలా అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారు
  • దీనిపై ఫిర్యాదు చేసేందుకు మంత్రి సంకోచిస్తున్నారు
  • ఈ అవినీతి చిక్కుముడిని జగన్ విప్పగలరా?

టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై విమర్శల దాడిని ప్రారంభించారు. బాలినేని పేరుతో ఆయన పీఏ భీమేశ్ ఎన్నో అవకతవకలకు, అవినీతికి పాల్పడ్డాడని వర్ల రామయ్య ఆరోపించారు. పలువురికి దొడ్డిదారిన ఉద్యోగాలు ఇప్పించడం, బదిలీలతో పాటు భీమేశ్ ఫోర్జరీలు చేస్తున్నట్లు లోకం కోడై కూస్తోందని వ్యాఖ్యానించారు.

తన పీఏ కావడంతో ఫిర్యాదు చేయడానికి మంత్రి బాలినేని సంకోచిస్తున్నారని విమర్శించారు. ఈ అవినీతి చిక్కుముడిని మీరు విప్పగలరా? అని సీఎం జగన్ ను నేరుగా ప్రశ్నించారు. ఈ మేరకు వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

Andhra Pradesh
balineni
minister
Jagan
YSRCP
Chief Minister
Telugudesam
varla ramaiah
Twitter
  • Loading...

More Telugu News