YS Viveka: మరిది వివేకాను గుర్తు చేసుకున్న వైఎస్ విజయమ్మ!

  • నేడు వైఎస్ వివేకా జయంతి
  • సమాధి వద్ద విజయమ్మ నివాళి
  • ఫోటోలు షేర్ చేసిన పుష్ప శ్రీవాణి

వైఎస్ వివేకానందరెడ్డి చాలా గొప్ప నేతని, ఆయన మృతి తమ కుటుంబానికి తీరని లోటని ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ వ్యాఖ్యానించారు. నేడు వివేకా జన్మదినోత్సవం కాగా, వివేకా సమాధి వద్ద ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నివాళులు అర్పించారు. ఈ చిత్రాన్ని ఏపీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. నేడు వివేకా జయంతిని గుర్తు చేశారు.

కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ వివేకా, తన ఇంటిలోనే అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అనుమానితులకు నిజ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు న్యాయస్థానం కూడా అంగీకరించింది. పాలీగ్రాఫ్, నార్కో అనాలిసిస్ పరీక్షల ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు.

YS Viveka
YS Vijayamma
Pushpa Srivani
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News