Andhra Pradesh: జగన్ గారూ.. ఏపీలో ఫ్యాక్షన్ రాజ్యం, రౌడీ రాజ్యం నెలకొల్పవద్దు!: కేశినేని నాని

  • నిన్న డాక్టర్లపై డీసీపీ హర్షవర్థన్ దాడి
  • వైద్యులకు మద్దతుగా నిలిచిన టీడీపీ నేత నాని
  • శాంతియుతంగా ధర్నాకు దిగితే  పోలీసులతో కొట్టిస్తున్నారని ఆగ్రహం

విజయవాడలో డీసీపీ హర్షవర్థన్ జూనియర్ డాక్టర్లపై నిన్న దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ పాలనలో తమ సమస్యలపై శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీసులతో కొట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశాంతంగా  ఉన్న ఏపీలో రౌడీ రాజ్యం, ఫ్యాక్షన్ రాజ్యం, పోలీస్ రాజ్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కేశినేని నాని.. దీనికి ఏపీ గవర్నర్, సీఎం జగన్, డీజీపీ, విజయవాడ సిటీ పోలీస్ తదితరుల్ని ట్యాగ్ చేశారు.

Andhra Pradesh
Jagan
Chief Minister
Vijayawada
Kesineni Nani
Telugudesam
  • Error fetching data: Network response was not ok

More Telugu News