Pranab Mukherjee: నేడు భారతరత్న పురస్కారాన్ని స్వీకరించనున్న ప్రణబ్ ముఖర్జీ

  • 1935లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించిన ప్రణబ్ దాదా
  • రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా విధుల నిర్వహణ
  • 2012 జూలై 25న రాష్ట్రపతిగా బాధ్యతల స్వీకరణ

భారత 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను స్వీకరించనున్నారు. అలాగే, దివంగత సామాజిక కార్యకర్త నానాజీ దేశ్ ముఖ్, దివంగత ప్రఖ్యాత గాయకుడు భూపేన్ హజారికాల తరఫున కూడా వారి కుటుంబీకులు భారతరత్న పురస్కారాన్ని స్వీకరించనున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆ పురస్కారాలను అందిస్తారు.

పశ్చిమబెంగాల్ లోని ఓ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో 1935లో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన జర్నలిస్టుగా పని చేశారు. 1969లో ఆయన తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ హయాంలో ఆయన నాలుగు సార్లు కేంద్ర మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. భారత రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు. 2012 జూలై 25న ఆయన రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించారు.

  • Loading...

More Telugu News