nerkonda paarvai: విడుదలకు ముందే నెట్టింట అజిత్ కొత్త చిత్రం!

  • అజిత్ హీరోగా 'నెర్కొండ పార్వై'
  • 'పింక్'కు రీమేక్ గా నిర్మించిన బోనీ కపూర్
  • రెండురోజుల ముందే నెట్టింట పైరసీ

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్, తన తొలి తమిళ చిత్రంగా అజిత్, విద్యాబాలన్, శ్రద్ధా శ్రీనాధ్, అభిరామి తదితరులతో 'పింక్' రీమేక్ గా 'నెర్కొండ పార్వై' అనే సినిమాను నిర్మించగా, విడుదలకు రెండు రోజుల ముందే సినిమా ఆన్ లైన్ లో పైరసీ రూపంలో ప్రత్యక్షమైంది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా, మంగళవారం నుంచి విదేశాల్లో ప్రీమియర్ షోలు వేశారు.

 ఈ షోలకు మంచి స్పందన వచ్చింది. సినిమా చాలా బాగుందని, అజిత్ నటన సూపరని కితాబులు కూడా వచ్చాయి. ఇదే సమయంలో సినిమాను ఎక్కడ పైరసీ చేశారో తెలియడం లేదుగానీ, నెట్టింట్లోకి వచ్చేసింది. తొలి ప్రీమియర్ షోలు మంగళవారం ఉదయం విదేశాల్లో పడగా, సాయంత్రమే వెబ్‌ సైట్లలో సినిమా కనిపించింది. దీంతో విడుదలకు రెండు రోజుల ముందే సినిమా పైరసీ అయితే, తమ గతి ఏంటని ఎగ్జిబిటర్‌ లు వాపోతున్నారు. అజిత్‌ లాంటి హీరోకే ఈ గతి పడితే, చిన్న చిత్రాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

nerkonda paarvai
Pink
Piracy
Ajit
Boney Kapoor
  • Loading...

More Telugu News