Augutst 15: దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో సందర్శకుల అనుమతిపై తాత్కాలిక నిషేధం

  • 73వ స్వాతంత్ర్య దినోత్సవానికి సిద్ధమవుతున్న భారత్
  • ఎయిర్ పోర్ట్స్ ను లక్ష్యంగా చేసుకోవచ్చన్న హెచ్చరికలు
  • ఈ నెల 10 నుంచి 20 వరకు నిషేధాజ్ఞలు అమలు

డెబ్బై మూడవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు యావత్తు భారతం సిద్ధమవుతోంది. అయితే, దేశంలో ఉగ్ర దాడులు జరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకోవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో సందర్శకుల అనుమతిపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నెల 10 నుంచి 20 వరకు దేశ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. ఈ మేరకు విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. నిషేధాజ్ఞలను తప్పనిసరిగా అమలు చేయాలని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో ఆదేశించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News