Andhra Pradesh: జగన్ గారూ.. ప్రధాని ఏపీకి ఏం ఇచ్చారు? మీరేం తెచ్చారో ప్రజలకు చెప్పండి!: వర్ల రామయ్య

  • మోదీతో సమావేశ ఫలితం ఏమిటి?
  • ఈ విషయాన్ని జగన్ బయట పెట్టాలి
  • ట్విట్టర్ లో వరుస ప్రశ్నలు సంధించిన టీడీపీ నేత

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై టీడీపీ నేత వర్ల రామయ్య జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన జగన్ ఏం సాధించారని ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రి ప్రధానిని ఏం అడిగారు? దానికి ప్రధాని మోదీ ఏం చెప్పారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

మోదీ-జగన్ సన్నిహితులనీ, ఏది అడిగినా మోదీ చేసిపెడతారని గతంలో కొందరు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ విషయం ఇప్పుడేమయిందని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్ర ప్రజలకు ఏం తెచ్చారో జగన్ చెప్పాలనీ, ఇందుకు రహస్యం ఏమీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు వర్ల రామయ్య ట్విట్టర్ లో స్పందించారు.

Andhra Pradesh
Jagan
Chief Minister
YSRCP
Telugudesam
varla ramaiah
Twitter
Narendra Modi
delhi tour
  • Error fetching data: Network response was not ok

More Telugu News