Andhra Pradesh: జగన్ పాలనకు ప్రకృతి కూడా సహకరిస్తోంది!: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి

  • 8 ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్ నిండింది
  • రాష్ట్రంలోని రైతులందరికీ మంచి రోజులు వచ్చాయి
  • సాగర్ కుడికాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

గత 8 సంవత్సరాలుగా నిండని నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఇప్పుడు నిండుగా నీళ్లు వచ్చాయని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఏపీలోని రైతులందరికీ ఇక మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు ప్రకృతి కూడా సహకరిస్తోందని చెప్పారు. నాగార్జునసాగర్ కుడికాలువ  నుంచి 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అనంతరం ల్లి పిన్నెల్లి మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తోందని పేర్కొన్నారు.

Andhra Pradesh
Jagan
YSRCP
Chief Minister
macherla
mla
pinnelli ramakrishna reddy
  • Loading...

More Telugu News