Andhra Pradesh: ఢిల్లీలో బిజీబిజీగా ఏపీ సీఎం జగన్.. రాష్ట్రపతి కోవింద్ తో భేటీ!

  • రాష్ట్రపతిని శాలువాతో సత్కరించిన ఏపీ సీఎం
  • శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపిక అందజేత
  • ఇప్పటికే మోదీ, వెంకయ్యతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో నిన్న సమావేశమైన జగన్ తాజాగా ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ ను శాలువాతో సన్మానించిన జగన్.. ఆయనకు శ్రీవేంకటేశ్వ స్వామి జ్ఞాపికను అందజేశారు.  

అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో సమావేశమైన ఏపీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. కాగా, ఇందుకు వెంకయ్యనాయుడు కూడా సానుకూలంగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ వెంట వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి, వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Andhra Pradesh
Jagan
Chief Minister
YSRCP
President Of India
Ram Nath Kovind
New Delhi
Venkaiah Naidu
Narendra Modi
  • Loading...

More Telugu News