Andhra Pradesh: లుకౌట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నటుడు శివాజీ!

  • అలంద మీడియా కేసులో శివాజీపై కేసు నమోదు 
  • ఇందులో తన తప్పు ఏమీ లేదన్న శివాజీ 
  • లుకౌట్ నోటీసు కొట్టివేయాలని కోర్టును కోరిన శివాజీ

అలంద మీడియా కేసులో షేర్ల బదిలీ అక్రమాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై సైబరాబాద్ పోలీసులు జారీచేసిన లుకౌట్ నోటీసులను కొట్టివేయాలని ఆయన కోరారు. తాను ఎలాంటి తప్పు చేయలేదనీ, అలాంటప్పుడు తనపై లుకౌట్ నోటీసులు జారీచేయడం సరికాదని పిటిషన్ లో పేర్కొన్నారు. అలంద మీడియాకు చెందిన టీవీ9కు సంబంధించి ఫోర్జరీ, మోసాలకు పాల్పడినట్లు ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాష్ పైన, షేర్ల బదిలీ అక్రమాలకి సంబంధించి ఆయన స్నేహితుడైన శివాజీపైనా కేసు నమోదైంది.

Andhra Pradesh
actor
sivaji
TV9
ALANDA MEDIA
Telangana
High Court
lookout notice
  • Loading...

More Telugu News