Andhra Pradesh: మంగళగిరి చేనేత పరిశ్రమ అభివృద్ధికి నావంతు కృషి చేస్తా!: నారా లోకేశ్

  • నేడు జాతీయ చేనేత దినోత్సవం
  • చేనేత కళాకారులకు శుభకాంక్షలు చెప్పిన లోకేశ్
  • చేనేత కళాకారుల కష్టం, కళ వెలకట్టలేనివని వ్యాఖ్య

టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికుల కష్టం, కళ వెలకట్టలేనివని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని చేనేత కళాకారులకు శుభాకాంక్షలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. మంగళగిరి చేనేత పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని లోకేశ్ చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేసిన లోకేశ్ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

Andhra Pradesh
mangalagiri
Nara Lokesh
Twitter
Telugudesam
handloom
National Handloom Day
  • Loading...

More Telugu News