Pakistan: పంజాబ్ లో ఉగ్రదాడికి ప్రయత్నాలు... భద్రత కట్టుదిట్టం!

  • నిఘా వర్గాల నుంచి సమాచారం
  • ఆత్మాహుతి దాడులు జరగవచ్చన్న ఐబీ
  • కుట్రలను భగ్నం చేయాలన్న అమరీందర్ సింగ్

పార్లమెంట్ లో జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో పంజాబ్ లో ఉగ్రదాడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు, అన్ని జోన్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దుల వద్ద ఉగ్రవాదుల కదలికలను గుర్తించామని వెల్లడించింది. కాగా, అధికారులతో సమీక్ష జరిపిన సీఎం అమరీందర్ సింగ్, పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకల కుట్రలను భగ్నం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు.

  • Loading...

More Telugu News