Jammu And Kashmir: కశ్మీరులో కొనసాగుతున్న నిర్బంధం.. 400 మంది అరెస్ట్

  • తాత్కాలిక జైళ్లుగా మారుతున్న హోటళ్లు, అతిథి గృహాలు
  • 91 ఏళ్ల వేర్పాటువాద నాయకుడికి గృహ నిర్బంధం
  • తనను కూడా నిర్బంధించారన్న ఫరూక్ అబ్దుల్లా

కశ్మీరు లోయలో అరెస్టులు కొనసాగుతున్నాయి. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను కేంద్రం రద్దు చేయడానికి ముందు కశ్మీరుకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలువురు రాజకీయ నాయకులు, వారి అనుచరులు, వేర్పాటువాదులను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇప్పటి వరకు 400 మందిని అరెస్ట్ చేశారు.

అదుపులోకి తీసుకున్న వారిని ఉంచేందుకు హోటళ్లు, అతిథి గృహాలు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను తాత్కాలిక జైళ్లుగా మార్చేశారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులైన ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను హరినివాస్‌లోని వేర్వేరు కాటేజీలకు తరలించగా, వేర్పాటువాద నాయకుడు (91) సయ్యద్ అలీషా గిలానీని గృహ నిర్బంధంలో ఉంచారు. తనను కూడా గృహనిర్బంధం చేశారని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.

Jammu And Kashmir
farooq abdullah
syed ali shah geelani
  • Loading...

More Telugu News