Tamannaah: నా పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి: తమన్నా

  • పుష్కర కాలంగా తమన్నా హీరోయిన్
  • ఎవరితోనూ ప్రేమలో పడలేదన్న మిల్కీ బ్యూటీ
  • పెళ్లికి ఇంట్లో నిర్ణయం తీసుకున్నారన్న తమన్నా

గుజరాత్ లో పుట్టి పెరిగినా, గడచిన పుష్కర కాలంగా దక్షిణాది అమ్మాయిగా మారిపోయి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన తమన్నాకు పెళ్లి వయసు వచ్చేసిందని ఆమె తల్లి భావిస్తోందట. తన కుమార్తెకు మంచి వరుడిని వెతికే ప్రయత్నంలో ఉందట. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా వెల్లడించింది.

ఇంట్లో తనకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారని, ఇది అమ్మ నిర్ణయమేనని, ప్రస్తుతం ఆమె వరుడిని వెతికే ప్రయత్నాలను ముమ్మరం చేసిందని చెప్పుకొచ్చింది. తాను ఎవరిని వివాహం చేసుకోవాలన్న విషయాన్ని అమ్మానాన్నలకే వదిలేశానని చెప్పిన తమ్మూ, ఈ మధ్య తనపై వచ్చిన ప్రేమ, డేటింగ్ వార్తలన్నీ వదంతులేనని మండిపడింది. తాను ఎవరినీ ఇంతవరకూ ప్రేమించలేదని, ఎవరినైనా ప్రేమిస్తే ముందుగా మీడియాకే చెబుతానని అంటోంది. కాగా, ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ విశాల్‌ కు హీరోయిన్ గా 'పెట్రోమ్యాక్‌' అనే సినిమాలో నటిస్తోంది.

Tamannaah
Marriage
Bride
Tollywood
  • Loading...

More Telugu News