Deepak Chahar: 3 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన దీపక్ చహర్.. కష్టాల్లో విండీస్

  • టీమిండియా, వెస్టిండీస్ మధ్య మూడో టి20 మ్యాచ్
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ
  • చహర్ ధాటికి విండీస్ టాపార్డర్ కకావికలం

వెస్టిండీస్ తో మూడో టి20 మ్యాచ్ లో భారత యువ పేసర్ దీపక్ చహర్ అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. చహర్ ధాటికి వెస్టిండీస్ టాపార్డర్ కకావికలం అయింది. చహర్ కొత్తబంతితో మెరుపులు మెరిపిస్తూ కేవలం 3 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఓపెనర్లు లూయిస్, నరైన్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ హెట్మెయర్ స్వల్పస్కోర్లకే వెనుదిరిగారు. ప్రస్తుతం విండీస్ స్కోరు 6 ఓవర్లలో 3 వికెట్లకు 22 పరుగులు. పొలార్డ్, పూరన్ క్రీజులో ఉన్నారు. ప్రావిడెన్స్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం పడిన పరిస్థితుల్లో పిచ్ పై ఉన్న తేమను దీపక్ చహర్ సద్వినియోగపర్చుకుని విండీస్ లైనప్ ను చిక్కుల్లోకి నెట్టాడు.

Deepak Chahar
West Indies
India
T20
  • Loading...

More Telugu News