MS Dhoni: ఆర్మీ జవాన్లను ఉత్సాహపరిచేందుకు గాయకుడి అవతారమెత్తిన ధోనీ

  • కశ్మీర్ లోయలో సాధారణ గార్డు విధులు నిర్వర్తిస్తున్న ధోనీ
  • పారామిలిటరీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ధోనీ
  • ఉద్రిక్త పరిస్థితుల్లోనూ గుండె నిబ్బరంతో విధుల్లో పాల్గొంటున్న వైనం

టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ సైనిక విధుల్లో భాగంగా కశ్మీర్ లో జవాన్ల మధ్య ఉన్న సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నా సరే వెనుదిరిగి రాకుండా, చిత్తశుద్ధితో గార్డు, పెట్రోలింగ్ విధుల్లో పాల్గొంటున్నాడు. ఇటీవలే విరామ సమయంలో సహచరులతో వాలీబాల్ ఆడుతూ కనిపించిన ధోనీ తాజాగా గాయకుడి అవతారమెత్తాడు. అత్యంత ఒత్తిడితో కూడిన విధులతో అలసిన ఇతర జవాన్లకు ఉల్లాసం కలిగిస్తూ బాలీవుడ్ గీతాలు ఆలపించాడు.

'కభీ కభీ' చిత్రంలోని 'మై పల్ దో పల్ కా షాయర్ హూ' పాట పాడి అలరించాడు. ప్రస్తుతం 106 టీఏ బెటాలియన్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా వ్యవహరిస్తున్న ధోనీ ఆగస్టు 15 వరకు విధుల్లో కొనసాగనున్నాడు. కాగా, ధోనీకి సంబంధించిన మరో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణ సౌకర్యాలున్న ఓ గదిలో తన బూట్లను తానే పాలిష్ చేసుకుంటూ సింపుల్ గా కనిపించాడు. ధోనీ నిరాడంబరతకు ఇదే నిదర్శనం అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

MS Dhoni
Jammu And Kashmir
Cricket
India
  • Error fetching data: Network response was not ok

More Telugu News