Article: ఆర్టికల్ 370 రద్దుపై రాష్ట్రపతి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ‘సుప్రీం’లో పిటిషన్
- అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ‘సుప్రీం’ న్యాయవాది
- ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి
- పిటిషన్ లో పేర్కొన్న న్యాయవాది ఎంఎల్ శర్మ
జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు నిన్న రాజ్యసభ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు సంబంధించి ప్రస్తుతం లోక్ సభలో చర్చ కొనసాగుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి నిన్న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ విషయమై సుప్రీంకోర్టు న్యాయవాది ఎంఎల్ శర్మ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.