AKhilesh Yadav: కశ్మీర్ ప్రజలు ఆనందంలో లేరు... చాలా దుఃఖంలో ఉన్నారు: అఖిలేశ్ యాదవ్

  • కశ్మీర్ నేతలను అక్రమంగా నిర్బంధించారంటూ ఆగ్రహం
  • తన సహచర ఎంపీలు అరెస్ట్ కావడం పట్ల విచారం వ్యక్తం చేసిన అఖిలేశ్
  • పీఓకే పై కేంద్రం వైఖరి వెల్లడించాలంటూ డిమాండ్

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ప్రశంసలతో పాటే విమర్శలు కూడా తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఘాటుగా స్పందించారు. కశ్మీర్ ప్రజలు ఆనందంలో లేరని, ఎంతో దుఃఖంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. కశ్మీర్ నేతలను అక్రమంగా నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సహచర ఎంపీలు అరెస్ట్ కావడం ఎంతో బాధ కలిగించిందని అఖిలేశ్ పేర్కొన్నారు. కశ్మీర్ లో ఇప్పుడు తీవ్ర గందరగోళ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనా కేంద్రం తన వైఖరి స్పష్టం చేయాలని ఈ యూపీ నేత డిమాండ్ చేశారు.  

AKhilesh Yadav
SP
Uttar Pradesh
Jammu And Kashmir
  • Loading...

More Telugu News