Jammu And Kashmir: దశాబ్దాల కల నెరవేరుతుండటం సంతోషం: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు

  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం  
  • జమ్ముకశ్మీర్ లో మంచి జరుగుతుందని ఆశిస్తున్నా
  • కశ్మీర్ పునర్విభజన బిల్లుకు మా మద్దతు ఉంటుంది

జమ్ముకశ్మీర్ విషయంలో దశాబ్దాల కల నెరవేరుతుండటం సంతోషంగా ఉందని వైసీపీ సభ్యుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు, ఆర్టికల్ 370 రద్దు తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, కేంద్రం నిర్ణయాల వల్ల జమ్ముకశ్మీర్ లో మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఒకే దేశం, ఒకే అజెండా నినాదం మంచిదేనని, కశ్మీర్ పునర్విభజన బిల్లుకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Jammu And Kashmir
Article 30
YSRCP
mp
  • Loading...

More Telugu News