Jammu And Kashmir: కేంద్రం చెప్పమన్న విషయాలనే జమ్ముకశ్మీర్ గవర్నర్ చెబుతున్నారు: అఖిలేశ్ యాదవ్

  • జమ్ముకశ్మీర్ ప్రజలు ఎంతో ఆందోళనతో ఉన్నారు
  • రెండ్రోజులుగా ఏం జరుగుతోందో అందరం చూస్తున్నాం
  • కశ్మీర్ పై బలప్రయోగం చేయాలని చూస్తున్నారు

జమ్ముకశ్మీర్ లో ఏం జరుగుతుందో తెలీదని అక్కడి గవర్నరే చెబుతున్నారని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) సభ్యుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం చెప్పమన్న విషయాలనే గవర్నర్ చెబుతున్నారని ఆరోపించారు. జమ్ముకశ్మీర్ ప్రజలు ఎంతో ఆందోళనతో ఉన్నారని, రెండ్రోజులుగా ఏం జరుగుతోందో అందరం చూస్తున్నామని అన్నారు. కశ్మీర్ పై బలప్రయోగం చేయాలని చూస్తున్నారని అఖిలేశ్ ఆరోపించారు. 

Jammu And Kashmir
POK
SP
Akhilesh Yadav
  • Loading...

More Telugu News