Amit Shah: అక్సాయ్ చిన్ కూడా ఇండియాదే: అమిత్ షా

  • పీవోకే, అక్సాయ్ చిన్ రెండూ జమ్ముకశ్మీర్ లో అంతర్భాగాలే
  • లడఖ్ ప్రజల కోరికను మోదీ నెరవేర్చారు
  • పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టకుండా నన్ను ఎవరూ అడ్డుకోలేరు

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు అక్సాయ్ చిన్ (ప్రస్తుతం ఇది చైనా అధీనంలో వుంది) కూడా మనదేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. లోక్ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, పీవోకే, అక్సాయ్ చిన్ రెండూ జమ్ముకశ్మీర్ లో అంతర్భాగాలేనని అన్నారు. కేంద్రపాలిత ప్రాంతం చేయాలంటూ ఎంతో కాలం నుంచి లడఖ్ ప్రజలు చేస్తున్న డిమాండ్ ను ప్రధాని మోదీ నెరవేర్చారని చెప్పారు. జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారు. జమ్ముకశ్మీర్ బిల్లు కశ్మీర్ ప్రజల హక్కులను కాలరాస్తుందనే విపక్ష నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ... పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టకుండా తనను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

  • Loading...

More Telugu News