Rahul Gandhi: ఆర్టికల్ 370 రద్దుపై తీవ్రస్థాయిలో స్పందించిన రాహుల్ గాంధీ
- ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ఎన్డీయే నిర్ణయం
- తప్పుబట్టిన రాహుల్ గాంధీ
- జాతీయ భద్రతకు సమాధి కట్టారంటూ మండిపాటు
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ఎన్డీయే సర్కారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను నిర్బంధించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూకశ్మీర్ ను ఏకపక్షంగా ముక్కలు చేసినంత మాత్రాన జాతీయ సమగ్రత సాకారం కాదని విమర్శించారు. ఈ దేశం ప్రజలతో నిర్మితమైందని, దేశమంటే హద్దురాళ్లతో కూడిన భూములు కాదని మండిపడ్డారు. కార్యనిర్వాహక శక్తి దుర్వినియోగంతో జాతీయ భద్రతకు సమాధి కట్టారని ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.